అభివృద్ధి కోసం ఆదరించి గెలిపించండి

అభివృద్ధి కోసం ఆదరించి గెలిపించండి
14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి మానస హన్మంతు
రైటప్: ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి మానస హన్మంతు
మక్తల్ , ఫిబ్రవరి 9 (ఆంధ్రప్రభ) మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అభివృద్ధి కోసం ఆదరించి గెలిపించాలని కౌన్సిలర్ అభ్యర్థి వాకిటి మానస హన్మంతు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజచన సోమవారం రోజు పార్టీ నాయకులు మహిళలతో కలిసి వార్డు పరిధిలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి బొట్టు పెట్టి ఓట్లు అభ్యర్థించారు. మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం. మీరంతా అండగా నిలవండి అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటూ భరోసా కల్పించారు. స్థానికంగా ఉన్న సమస్యల పట్ల తనకు పూర్తిగా అవగాహన ఉందని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు .ఈ ప్రాంతంలో ప్రతి గల్లీలో సిసి రోడ్లు మురుగు కాలువల నిర్మాణం చేపడతామన్నారు.
అదేవిధంగా మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు .మంత్రి వాకిటి శ్రీహరి మన ప్రాంతం వాడుకోవడం వల్ల పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు .అభివృద్ధిలో 14 అవార్డును అగ్రభాగాన నిలపడమే తన ధ్యేయమని అన్నారు .మంత్రి శ్రీహరి సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకుందామని మీరంతా ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపించాలని కోరారు .కౌన్సిలర్గా పదవి మాత్రమే తనదని కానీ వార్డులోని ప్రతి ఒక్కరు కౌన్సిలర్ గా భావించాలని అదే తన విధానం అని అన్నారు. సేవ చేసే అవకాశం తనకు ఇవ్వాలన్నారు. ఈ నెల 11న జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి 14వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని వాకిటి మానస హన్మంతు విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏఎంసీ డైరెక్టర్ అంజి,మాజీ వార్డు సభ్యులు వాకిటి శ్రీనివాసులు, వాకిటి గౌతమి రాము, కాంగ్రెస్ నాయకులు వి.రాజు, వి .నాగరాజు, బి. రమేష్ ,వి .వెంకటేష్ ,వి .కృష్ణయ్యవి. భీమేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
