Ranjith l ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలి…

Ranjith l ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలి…
Ranjith l ధర్మపురి, ఆంధ్రప్రభ: ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు కౌన్సిలర్ గా 13 వ వార్డు ప్రజలు ఒక్కసారి ఆశీర్వదించి గెలిపించాలని వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి బండారి రంజిత్ ఓటర్లను కోరారు.వార్డు లో ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదివారం 13వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వార్డు అభివృద్ధి జరిగిందని తాను గెలిచిన అనంతరం మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా అన్నారు
