Ravendhar l కార్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్న గరిసే రవీందర్…

Ravendhar l కార్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్న గరిసే రవీందర్…

అందుబాటులో ఉండి సేవకునిగా పని చేస్తా ఆదరించి గెలిపించండి
-5 వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి గరిసే రవీందర్

Ravendhar l లక్షేట్టిపేట,ఆంధ్ర ప్రభ: 5 వ వార్డ్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వార్డ్ అభివృద్ధికి సేవకునిగా నిరంతరం పని చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి గరిసే రవీందర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వార్డ్ లో ప్రజలను కలిసి ఓటు అభ్యర్థించారు. కాలనీలో సమస్యలపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా కార్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఆయన కోరారు. గతంలో ఇదే వార్డ్ మెంబర్ గా వార్డ్ లోని ప్రజలకు పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు,సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా ఎల్లప్పుడూ సేవలందించినట్లు పేర్కొన్నారు.

మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని తెలిపారు. కరోనా సమయంలో కాలనీ వాసులకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా సేవలు అందించినట్లు గుర్తు చేశారు. వార్డ్ లోని అన్ని ప్రధాన వీధుల్లో స్థానిక నాయకులతో కలిసి గరిసే రవీందర్ దంపతులు ప్రచారం నిర్వహించారు. ఓటర్ల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూస్తుంటే గరిసే రవీందర్ విజయం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా కార్ గుర్తు అఖండ విజయం సాధిస్తుందని వార్డ్ ప్రజలు అనుకుంటున్నారు.గడప గడపకు వెళ్లి వార్డ్ అభివృద్ధికి తనను గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇది 5 వ వార్డ్ అభివృద్ధికి సంబంధించిన విజయమౌతుందని, వ్యక్తులు ఇక్కడ ముఖ్యం కాదని సేవకులే ముఖ్యమని ప్రజలు గుర్తించి కార్ గుర్తుకు అమూల్యమైన ఓటు వేయాలని ఓటర్లను ఆయన కోరారు.అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలో వార్డ్ లోని పలువురికి కల్యాణ లక్ష్మీ, షాదీముభారక్, పెన్షన్స్, ఇతర పనులు ఎన్నో దగ్గరుండి చేపించినట్లు వివరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు తులం బంగారం, పెరిగిన పెన్షన్స్, రైతు భరోసాతో పాటు ఎన్నో హామీలను నెరవేర్చలేదని ఓటర్లకు గుర్తు చేశారు.ఈ ప్రచారంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్,నాయకులు సతీష్ గౌడ్,అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply