మత్తు రహిత వార్డుగా తీర్చిదిద్దుతా

మత్తు రహిత వార్డుగా తీర్చిదిద్దుతా
- యువతకు ఉపాధి అవకాశాల కోసం కృషి చేస్తా
- 8వ వార్డు అభ్యర్థి పగిడిపాటి సుధా సుగుణాకర్ రాజు
జనగామ, ఆంధ్రప్రభ : అభివృద్ధి అంటే రోడ్లు ,పరిశుభ్రతే కాదనీ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టి ఉపాధి అవకాశాల కోసం కంపెనీలతో చర్చిస్తానని 8 వ వార్డు బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పగిడిపాటి సుధా సుగుణాకర్ రాజు అన్నారు. శనివారం 8 వ వార్డులో ఆమె విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రూప్ మీటింగులు ఏర్పాటు చేసి ప్రజలకు పలు సూచనలు హామీలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 8వ వార్డులో ప్రజల అవసరాలను దృష్టి పెట్టుకొని రోడ్ల నిర్మాణాలు, ప్రతిరోజు చెత్త సేకరణకు ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.
మత్తు పదార్థాల వినియోగాన్ని వార్డులో పూర్తిగా అరికట్టి , స్వచ్ఛ రూపొందిస్తానని అన్నారు. వార్డులోని యువత కోసం హైదరాబాదులోని వివిధ కంపెనీలతో చర్చించి జనగామలో జాబు మేళ ఏర్పాటు చేస్తానని అన్నారు. జిల్లా కేంద్రంలోని తమ ఆసుపత్రిలో ఉచిత ఓపి సౌకర్యాన్ని ఎనిమిదో వార్డు ప్రజలకు కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాల కోసం ప్రభుత్వానికి, శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తానని ఆమె తెలిపారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని 8 వ వార్డు అభ్యర్థి పగిడిపాటి సుధా సుగుణాకర్ రాజు
తెలిపారు.
