కుమార్ ను గెలిపించండి

కుమార్ ను గెలిపించండి
ఐదో వార్డు అభివృద్ధి బాధ్యత నాదే
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో పెద్దపల్లి పట్టణంలోని ఐదో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుజ్జుల కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్పష్టం చేశారు. ఇవాళ వార్డు పరిధిలో గడపగడపకు ప్రచారం నిర్వహించి ఈనెల 11న జరిగే పోలింగ్ లో చేతి గుర్తుపై ఓటు వేసి కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
గత రెండేళ్లుగా పెద్దపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, ప్రభుత్వం పట్టణాభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో వార్డు పరిధిలో అవసరం ఉన్న ప్రతిచోట సీసీ రోడ్లు, డ్రైనేజీలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. అధికార పార్టీకి ఓటు వేసి గెలిపిస్తేనే నిధులు వస్తాయని వార్డు అభివృద్ధి సాధ్యమవుతాయన్నారు. కుమార్ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాడన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
