Peddapalli | అధికారులకు పెద్దపల్లి కలెక్టర్ కీలక ఆదేశాలు

Peddapalli | అధికారులకు పెద్దపల్లి కలెక్టర్ కీలక ఆదేశాలు
- ఉపాధి హామి నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి
- అభివృద్ధి పనులపై కలెక్టరేట్‌లో సమీక్ష
- జూన్ 2 నాటికి ఇందిరా మహిళా శక్తి భవనం సిద్ధం కావాలి
- తహసీల్దార్ కార్యాలయాల పనులను వేగవంతం చేయండి
- ఉపాధి హామీ పనులపై ప్రత్యేక శ్రద్ధ
పెద్దపల్లి ఆంధ్రప్రభ : జిల్లాకు ఉపాధి హామి పథకం క్రింద మంజూరైన మెటీరియల్ కాంపోనెంట్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ… జూన్ రెండవ వారం నాటికి ఉపాధి హామి పథకం క్రింద మంజూరైన నిధుల వినియోగం పూర్తి కావాలన్నారు. జూన్ చివరి వరకు మంజూరైన ఉపాధి హామి పనులను ప్రత్యేక శ్రద్ధతో గ్రౌండింగ్ చేస్తూ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
జిల్లాలో నిర్మాణంలో ఉన్న నాలుగు తహసీల్దార్ కార్యాలయాల పనులను జూన్ రెండవ వారం నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ లో నిర్మిస్తున్న ఇందిరా మహిళ శక్తి జిల్లా భవనం పనులను పూర్తి చేసి జూన్ 2న ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో ఈఈ పంచాయతీరాజ్ శంకరయ్య, డి ఆర్ డి ఓ కాళిందిని, కలెక్టరేట్ ఏవో బండి ప్రకాష్, డీఈలు, ఏఈలు,సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
