రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ సమావేశం..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లతో ఈ రోజు సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్ మరియు బెజ్జంకి ఎస్ఐ తోట తిరుపతి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి, గ్రామాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు.
ముఖ్యంగా గ్రామ వివాదాలు, భూ తగాదాలు, దాడులు, బెదిరింపులు, జూదం, మద్యం సేవించి అల్లర్లు సృష్టించడం, మహిళలను వేధించడం వంటి సంఘ వ్యతిరేక చర్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా, పాత నేర ప్రవర్తనలను విడిచిపెట్టి కుటుంబ సభ్యులతో కలిసి సక్రమ మార్గంలో జీవిస్తూ సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలని సూచించారు. ప్రజల భద్రత, గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణ పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని అధికారులు స్పష్టం చేశారు.
