2వ, 3వ వార్డు  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి

2వ, 3వ వార్డు  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి

  • వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల లో  ఎమ్మెల్యే నాగరాజు

వర్ధన్నపేట, ఆంధ్రప్రభ ; మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య ప్రమీల , బాబులాల్  3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అఫ్సర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విస్తృతంగా ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ఈ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే నాగరాజు  ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సామాన్యుల పక్షాన నిలబడి పనిచేస్తోందని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన అందించడమే పార్టీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అనంతరం స్థానిక టీ షాప్ వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే నాగరాజు , అక్కడి యజమానిని సాదరంగా పలకరించి, స్వయంగా టీ, తయారు చేసి పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు పంపిణీ చేస్తూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ సాధారణ కార్యకర్తలా ప్రజల మధ్య తిరుగుతూ, ప్రజలతో మమేకమై ప్రచారం చేయడం స్థానిక ప్రజల్లో విశేష ఆదరణను పొందింది. ఈ కార్యక్రమం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై మరింత విశ్వాసాన్ని పెంచింది. ఈ కార్యక్రమంలో 2వ వార్డు ఇంచార్జీ జన్ను అనిల్ కుమార్, 2వ, 3వ వార్డు నాయకులు రైతు రాజు, కరాటే ప్రభాకర్, జన్ను అరుణాకర్‌లతో పాటు పలువురు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు…

Leave a Reply