Pedana | చురుగ్గా ఉపాధి హామీ పనులు

Pedana | చురుగ్గా ఉపాధి హామీ పనులు
Pedana | పెడన – ఆంధ్రప్రభ : పెడన నియోజకవర్గ పరిధిలోని గూడూరు మండలంలో ఉపాధి హామీ పనులు సాగుతున్నాయి. గత నాలుగు రోజులుగా గూడూరు నుంచి తుమ్మలపాలెం వెళ్లే రహదారిలో ఉన్న రుద్ర భూమీలో ముళ్ళ చెట్లు పొదలను తొలగిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పంట పొలాలు, మురుగు కాలువలు, పంట బోధలు ఆరుతడి పంటలు ఉన్న నేపథ్యంలో ముందుగా ఇలా గ్రామానికి చెందిన వాటిని అభివృద్ధి పరచడం అందరికి ఎంతో ఉపయోగకరమని మండల టీడీపీ అధ్యక్షుడు గోపి నాగబాబు పేర్కొన్నారు.
