school l గురుకుల పాఠశాల బాలికల ఖాళీ సీట్లకు బ్రోచర్ విడుదల..

school l గురుకుల పాఠశాల బాలికల ఖాళీ సీట్లకు బ్రోచర్ విడుదల..
నందిగామ, ఆంధ్రప్రభః పట్టణం కాకాని నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయం లో గురుకుల పాఠశాల ముప్పాళ్ళ స్కూల్ యాజమాన్యం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఖాళీగా ఉన్న సీట్లకు బాలికల నుంచి మాత్రమే దరఖాస్తులు ఆహ్వానిస్తూ బ్రోచర్‌ను విడుదల చేశారు.
ఈ బ్రోచర్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా అధికారికంగా ఆవిష్కరించారు. ఐదవ తరగతి, 6వ, 7వ, 8వ, 9వ, 10వ తరగతులతో పాటు ఇంటర్ మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లకు బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్కూల్ యాజమాన్యం తెలిపింది.
అప్లికేషన్ ఫీజుగా 100 రూపాయలు నిర్ణయించినట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే తేదీలు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు చివరి తేదీగా పేర్కొన్నారు. ఐదవ తరగతి, ఇంటర్ ప్రవేశ పరీక్ష మార్చి 1న నిర్వహించనున్నట్లు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశ పరీక్ష మార్చి 2న జరగనున్నట్లు తెలిపారు. ప్రవేశాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ముప్పాళ్ళ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గారిని 9704550065 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
school l గురుకుల పాఠశాల బాలికల ఖాళీ సీట్లకు బ్రోచర్ విడుదల..
