deer l దుప్పిిని అటవీ అధికారులకు అప్పగించిన ఎంఈఓ గడ్డి శ్రీనివాస్

deer l దుప్పిిని అటవీ అధికారులకు అప్పగించిన ఎంఈఓ గడ్డి శ్రీనివాస్
deer l తాడ్వాయి ఫిబ్రవరి 5 ఆంధ్రప్రభః ఏటూరునాగారం నుంచి కమలాపురం క్రమంలో దుప్పిల గుంపు రోడ్ దాటుతోండగా ఇసుక లారీ ఢీ కొట్టడంతో ఒక దుప్పి ప్రాణాపాయ స్థితిలో ఉంది. అటువైపు వెళ్తున్న తాడ్వాయి ఎంఈఓ గడ్డి శ్రీనివాస్ సృజన్ రాంబాబు మరికొంత మంది చూసి చలించి పోయారు. ఎంఈఓ గడ్డి శ్రీనివాస్ దుప్పిని ఏటూరునాగారం ఫారెస్ట్ ఆఫీస్ కు తీసుకొని వెళ్లి పశు వైద్యధికారితో చికిత్స చేయించి అటవీ అధికారులకు అప్పగించారు. ఈ సందర్బంగా గడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వన్యప్రాణులు అడవి కి ఆభరణాలు వంటివి వాటిని కాపాడుకుంటేనే జీవ వైవిద్యం సమత్తూల్యంగా ఉండి మానవ మనుగడ సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో సృజన్ రామన్న గూడెం రాంబాబు రామన్న గూడెం మరియు దయానంద్ బీట్ ఆఫీసర్ ఎఫ్ ఆర్ ఓ అబ్దుల్ రెహ్మాన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నారాయణ బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.
