Supreme Court | పూర్తిస్థాయి డీజీపీ నియామకప్రక్రియ పూర్తి చేయాలి

Supreme Court | పూర్తిస్థాయి డీజీపీ నియామకప్రక్రియ పూర్తి చేయాలి
Supreme Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 4 వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని యూపీఎస్సీ, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఏప్రిల్‍లో తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది.
గతేడాది తెలంగాణ డీజీపీగా బి.శివధర్ రెడ్డి నియామకం విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‍పై ఇవాళ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. 4 వారాల్లో పూర్తి స్థాయి డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని యూపీఎస్సీకి, తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది.
