Lawyers | రక్షణ చట్టాన్ని తక్షణమే ఆమోదించి, అమలు చేయాలి

Lawyers | రక్షణ చట్టాన్ని తక్షణమే ఆమోదించి, అమలు చేయాలి

  • ఉట్నూర్ లో న్యాయ వాదుల నిరసన

Lawyers | ఉట్నూర్, ఆంధ్రప్రభ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టి వెంటనే అమలు చేయాలనీ అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ బార్ అసోసియేషన్ న్యా యవాదులు డిమాండ్ చేశారు. చేవెళ్లకోర్టుబార్అసోసియేషన్‌కు చెందిన యువ మహిళా న్యాయవాది స్వప్నను రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో అత్యంత పాశవికంగా, అమానుషంగా హతమార్చడాన్ని నిరసిస్తూ ఉట్నూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం కోర్టు విధులు బహిష్కరించారు.

ఈ సందర్బంగా న్యాయవాదులు నల్ల బ్యాడ్జిలు ధరించి కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేసారు.అనంతరం పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ… మహిళా న్యాయవాది వామన రావు దంపతుల హత్యతో పాటుపలువురున్యాయవాదులపై జరుగుతున్న దాడులు మరువక ముందే, ఈ సంఘటన జరగడం మహిళా న్యాయవాదులకు అభద్రత భావం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

స్వప్న హత్యలో పాలుపంచుకున్న నిందితులందరినీ తక్షణమే గుర్తించి, కఠిన చర్యలు తీసుకొని ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ ద్వారావిచారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాపురెడ్డి, ఉపాధ్యక్షుడు జగన్ నాయక్, ప్రధాన కార్యదర్శి జైవంత్ రావు, న్యాయవాదులు జమీర్ ఖాన్, ధీరజ్ గుప్తా, పెందూర్ ప్రభాకర్, శ్రీనివాస్, గిరి, వసంత్ రావు, కుడెల్లి అశోక్ ,చంద్రమౌళి, నాతరి రాజు, విశాల్, వినోద్, లక్ష్మీ నారాయణ, అజాహర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply