Flexi | కరీంనగర్ కాంగ్రెస్‌లో ‘ఫ్లెక్సీ’ల చిచ్చు…

Flexi | కరీంనగర్ కాంగ్రెస్‌లో ‘ఫ్లెక్సీ’ల చిచ్చు…
Flexi | ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్ర ప్రభ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గూమ్లాపూర్ లో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో ఫ్లెక్సీల రగడ… కరీంనగర్ అసెంబ్లీ & పార్లమెంట్ కాంగ్రేస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ లలో కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫోటో లేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై స్థానిక కాంగ్రెస్ నేతలు తో పాటు జిల్లా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చొప్పదండి పర్యటన వేళ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం చిత్రానికి చోటు దక్కకపోవడం కలకలం రేపుతోంది. ఇంచార్జ్ వెలిచాలా రాజేందర్ రావు వర్గీయులు ప్రోటోకాల్‌ను విస్మరించడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం జిల్లా నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరును మరోసారి బహిర్గతం చేసింది.
