పలువురు కాంగ్రెస్ లో చేరిక

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పాక చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు మహిళలు మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి వెంకటయ్య కాంగ్రెస్ కండరాలు తప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
12వ వార్డు పార్టీ అభ్యర్థి పాక చిరంజీవి యాదవ్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెరుకు లింగస్వామి గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలలో మాజీ జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బొంగు జంగయ్య గౌడ్, సీతారామచంద్రస్వామి దేవాలయం అధ్యక్షులు బొబ్బిళ్ళ మురళి గురుస్వామి, తిరుపతి రవీందర్, 12వ వార్డు ఇన్చార్జులు మాధగోని శేఖర్ గౌడ్, బక్క శ్రీనాథ్, మాజీ వార్డ్ మెంబర్ ఎస్ కె జానీ బాబు, చౌటుప్పల్ మాజీ ఉపసర్పంచ్ పాలడుగు వెంకటేష్ గుప్తా, మాజీ వార్డ్ మెంబర్ బుంగపట్ల భారతమ్మ, బొబ్బిళ్ళ కుమార్, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో పాటు బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన రెడ్డి తిరులక్ష్మి, కవిత, మంగమ్మ, మీనా, సుజాత, కృష్ణమ్మ, లావణ్య, మౌనిక, మహేశ్వరి, వసంత తదితర 15 కుటుంబాలు, 12వ వార్డు శాంతినగర్ కు చెందిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
