kanta maheshwara swamy | బోనాల సమర్పణ..

kanta maheshwara swamy | బోనాల సమర్పణ..
kanta maheshwara swamy, మోత్కూర్, ఆంధ్రప్రభ : సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని మున్సిపల్ కేంద్రంలో గౌడ కులస్తుల దైవం శ్రీ కంట్ల మహేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం భోగి రోజున గ్రామంలోని బిక్కేరు ఒడ్డున, జామచెట్లబావి, పోతాయి గడ్డ పరిధిలోని కంట్ల మహేశ్వర స్వామి ఆలయాల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు తీసుకెళ్లి సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా దేవాలయం చుట్టూ బోనాలతో మహిళలు ప్రదక్షిణలు చేస్తూ శివ నామస్మరణతో భజనలతో ఆలయ ప్రాంగణం ఆనందోత్సాహాల నడుమ యువకులు, మహిళలు, వృద్ధులు సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పెద్ద గౌడు బీసు వెంకటయ్య, సారకొల్ల గౌడ్ బుర్ర ఉప్పలయ్యలు కంట్ల మహేశ్వర స్వామికి తొలి బోనం సమర్పించారు. అనంతరం గౌడ కులస్తుల బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు బుర్ర కృష్ణ, ఆకుల శ్రీనివాస్, లోడే యాదగిరి, బీసు సత్తయ్యమల్లికార్జున్, భాషా, శ్రీకాంత్ గౌడ్, సాయి, గణగాని శ్రీశైలం, డా.నర్సింహా, బుర్ర శ్రీనివాస్, మొరిగాల రాజయ్య , కారు పోతుల వెంకన్న, బోడిగే శ్రీహరి, మొరిగాల వెంకన్న, మొరిగాల సురేష్, మోరిగాల శీను, కోలా శ్రీను తదితరులు పాల్గొన్నారు.
