Police | ఉత్కృష్ట పతకాన్ని అందుకున్న వెస్ట్ డీసీపీ…

Police | ఉత్కృష్ట పతకాన్ని అందుకున్న వెస్ట్ డీసీపీ…

  • ఉత్తమ సేవలకు రాజ మహేంద్ర నాయక్ దక్కిన గౌరవం
  • డీసీపీకి ఉత్కృష్ట పతకాన్ని అందజేసిన వరంగల్ సీపీ

Police | వరంగల్ క్రైమ్, ఆంద్రప్రభ : పోలీస్ విభాగంలో ఉత్తమ సేవలు అందించిన వరంగల్ వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ కు కేంద్ర ప్రభుత్వం ఉత్కృష్ట పతకాన్ని ప్రకటించింది. బుధవారం పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా డిసిపి రాజమహేంద్ర నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ కు అభినందనలు తెలియజేశారు.

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచే అధికారులకు శాఖా పరమైన గుర్తింపుతో పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు కూడా లభిస్తుందని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. 2010 సంవత్సరంలో డీఎస్పీగా పోలీస్ శాఖలో చేరిన రాజమహేంద్ర నాయక్ నెల్లూరు జిల్లాలో చేరారు.ఆ తర్వాత వరంగల్ సిసిఎస్ ఏసీపీ గా, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో డి.ఎస్పీగా పని చేశారు. 2017 లో అదనపు ఎస్పీగా పదోన్నతి ని పొందిన తర్వాత భూపాలపల్లి, ఇంటెలిజెన్స్ వింగ్ ల్లో పనిచేశారు.

ఇక 2021లో ఎస్పీగా పదోన్నతి పొంది ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేసారు. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని వెస్ట్ జోన్ డీసీపీగా ఎంతో సమర్ధవంతంగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు రాజా మహేంద్ర నాయక్ పని చేసిన సమయంలో ఎన్నో కీలకమైన కేసులను పరిష్కరించి తన సమర్థతను, సామర్థ్యాన్ని నిరూపించు కొన్నారు. డీసీపీ రాజ మహేంద్ర నాయక్ పోలీస్ డిపార్ట్మెంట్ లో నిజాయితీగానే కాక నిష్పక్షపాతంగా పనిచేస్తూ గుర్తింపును పొందారు. ఈ సందర్బంగా వెస్ట్ జోన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది డీసీపీ రాజా మహేంద్ర నాయక్ కు అభినందనలు తెలిపారు.