Majority | మున్సిపల్ ఎన్నికలలో కడారి గెలుపున‌కు పెద్ది ప్రచారం:

Majority | మున్సిపల్ ఎన్నికలలో కడారి గెలుపున‌కు పెద్ది ప్రచారం:

Majority | నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలలో 1వ‌ వార్డు మాదన్నపేటలో బుధవారం కడారి కవిత కుమారస్వామి గెలుపు కోసం నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ ఎన్నికలలో విలీన గ్రామాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీనీ ఏకపక్షంగా బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.

బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సమన్వయంతో పనిచేసి కారు గుర్తు పైన పోటీ చేయు అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని కోరారు. మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్య క్రమంలో వార్డు ఎన్నికల ఇంచార్జ్ కక్కేరుల శ్రీనివాస్ గౌడ్, కోమండ్ల గోపాల్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహా రాములు, స్థానిక నాయ కులు పాల్గొన్నారు.

Leave a Reply