Kadiyam Srihari | ఎందుకంటే..

Kadiyam Srihari | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డంప్రసాద్ ఇవాళ నోటీసులు జారీ చేశారు. బుధవారం తమ ఎదుట విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు.
కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేసి నెగ్గిన తర్వాత కాంగ్రెస్ లోకి ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11గంటలకు జరగబోయే విచారణకు రావాల్సిందిగా వివేకాకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. కడియం, వివేకా వాదనలను స్పీకర్ విననున్నారు. మొత్తం పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లు తన ముందుకు రాగా.. ఇప్పటికే ఏడుగురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్లెవరూ పార్టీ మారలేదని.. బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు తీర్పు ఇచ్చారు.
