Campaign | గల్లీ నుంచి ఢిల్లీ దాకా మోడీ నాయకత్వాన్ని బలపరుద్దాం

గల్లీ నుంచి ఢిల్లీ దాకా మోడీ నాయకత్వాన్ని బలపరుద్దాం

  • మాజీ జెడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి

Campaign | వనపర్తి, ఆంధ్రప్రభ : వనపర్తి మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న వారి సమస్యలు మా సమస్యలుగా భావించి పరిష్కరించేందుకు ముందుండి తమ పార్టీ అభ్యర్థులు పనిచేస్తారని, బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మాజీ జెడ్పీ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి కోరారు. మున్సిపల్ ఎన్నికలు నీతి నిజాయితీకి డబ్బు మద్యం లాంటి ప్రలోభాలకు మధ్య జరుగుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. నీతి నిజాయితీతో పాలన అందించేందుకు ముందుకొస్తున్న బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వనపర్తి పట్టణంలోని ఆరు, ఏడు, పది 24, 25, తదితర వార్డుల చెందిన హమాలీల తో ఆయన మాట్లాడారు. పేదరిక నిర్మూలన పట్టణా భివృద్ధి కోసం నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. మున్సిపల్ పట్టణాలలో అనేక అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని వివరించారు. నిజాయితీ నీతి కి నిలువెత్తు నిదర్శనం గా నిలిచిన బిజెపి అభ్యర్థులను ఆశీర్వదించి మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

అదేవిధంగా వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా పట్టణంలో 29 వార్డులో మర్చంట్స్ అసోసియేషన్ పలువురు నాయకులు,న్యూ గంజి వ్యాపారులు, హమాలీలు, గుమస్తాలతో కలిసి 29 వ వార్డు అభ్యర్థి బిందు రెడ్డి, లోకనాథ్ రెడ్డి వార్డులో పర్యటించారు. దేశ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా నరేంద్రమోడీ నాయకత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.

మోడీ ప్రభుత్వాన్ని యువకులు మహిళలు రైతులు అందరూ ఆదరిస్తున్నారని అందుకు నిదర్శనమే వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది అన్నారు. మోడీ ప్రభుత్వం పట్ల విశ్వసనీయత పెరిగిందని నీతి నిజాయితీతో పాలను అందించేందుకు ముందుకు వస్తున్న బిజెపి త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వనపర్తి మున్సిపాలిటీ పై బిజెపి జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply