HYD | కేబుల్ బ్రిడ్జిపై బైకు దగ్ధం

HYD | కేబుల్ బ్రిడ్జిపై బైకు దగ్ధం

HYD | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగరంలోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఇవాళ ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బైకుపై ఇద్దరు ప్రయాణిస్తుండగా ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

గమనించిన వారు అప్రమత్తమై వెంటనే వాహనాన్ని నిలిపి పక్కకు దూకడంతో పెనుప్రమాదం తప్పింది. క్షణాల్లోనే బైకు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో వంతెనపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మంటలను అదుపుచేశారు.

Leave a Reply