TG | ‘పాలరాజు’కు డైరీ ఫామ్ చైర్మన్ పట్టం..

TG | ‘పాలరాజు’కు డైరీ ఫామ్ చైర్మన్ పట్టం..
TG |మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ కు చెందిన వీరమల్ల రాజయ్య అలియాస్ పాలరాజును జిల్లా డైరీ ఫామ్ చైర్మన్ గిరి వరించింది. మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు నుంచి నామినేషన్ వేసిన ఆయన ఎట్టకేలకు తన నామినేషన్ ఉపసంహరించుకోవడానికి అంగీకరించడంతో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయనకు చైర్మన్ కు పదవి కట్టబెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ వార్డులో విక్రమ్ గౌడ్ సురేష్ పాలరాజు.. ముగ్గురు నామినేషన్ వేయగా.. మంత్రి హామీ మేరకు పాలరాజు తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆయనకు జిల్లా డైరీ ఫాం చైర్మన్ పదవి ఇస్తారని తెలియడంతో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వర్షం వ్యక్తం అవుతోంది.
