8th Ward | సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతా

8th Ward | సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతా

  • కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో పోగుల సారంగపాణి పోటీ

8th Ward | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలోని 8వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోగుల సారంగపాణి ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయనకు స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. ఈ సందర్బంగా సోమవారం సారంగపాణి మాట్లాడుతూ..గతంలో పేదలకు ఇండ్లు ఇప్పించిన అనుభవం తనకు ఉంది. గెలిచిన వెంటనే 8వ వార్డులో పెంకుటిల్లులు లేకుండా ప్రతి పేద వాడికి పక్కా ఇండ్లు ఇప్పించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.

కాంగ్రెస్ నాయకుడు కడియం శ్రీహరి ఆశీస్సులతో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచినీళ్ల బావి నుంచి వయా కమ్మరిపేట, రాజన్న బంగ్లా వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. కమ్మరిపేట ఆమ్లె ట్ ఏర్పడి ప్రాంతం నుంచి సీసీ రోడ్డు నిర్మించి, ప్రజల చిరకాల కలను నెరవేర్చిన ఘనత తమకే దక్కిందని చెప్పారు. అధికారులను సమర్థ వంతంగా మెప్పించి సుమారు రూ.1 కోటి నిధులు మంజూరు చేయిం చుకొని రోడ్డు పనులు పూర్తి చేయించినట్లు వివరించారు. హైవే నుంచి మంచినీళ్ల బావి వరకు పూర్తిస్థాయి సీసీ రోడ్డు వేయిస్తానని, ప్రజలకు ఇచ్చిన మాటకు ఎప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

వార్డులో మట్టి రోడ్లు లేకుండా చేస్తా :

ప్రస్తుతం కూడా 8వ వార్డులో ఎక్కడా మట్టి రోడ్లు లేకుండా పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు నిర్మించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు సారంగపాణి తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తాను. కురుమ సంఘానికి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో నాయి బ్రాహ్మణ, కుమ్మరి సంఘాలకు కూడా కడియం శ్రీహరి ఆశీస్సులతో సహాయం అందించిన ట్లు వెల్లడించారు. అదే విధంగా గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కడియం శ్రీహరి ఆశీస్సులతో సుమారు రూ.4 కోట్ల నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేయడం జరిగిందని, త్వరలోనే అభివృద్ధి పను లు ప్రారంభం కానున్నాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా గా పారదర్శక పాలన అందించడమే తన లక్ష్యమని సారంగపాణి పేర్కొన్నారు.

Leave a Reply