School | గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి

School | గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి
School | కుంటాల, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పట్టుకొమ్మల్లాగా పనిచేయాలని సృజన విద్యా నిలయంలో ఆదివారం మండల సర్పంచ్ ఉప సర్పంచ్ లకు పాఠశాల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సృజన విద్యా నిలయం ప్రిన్సిపల్ కొత్త కాపు గంగన్నతో పాటు ఎంపీఓ ఎంఏ అబ్దుల్ రహీంలు మాట్లాడుతూ… నూతనంగా గెలుపొందిన సర్పంచ్, ఉపసర్పంచులు కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధికి పట్టుకొమ్మల్లాగా పని చేయాలని, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే గ్రామాల్లో పారదర్శకంగా పనిచేసినప్పుడే గ్రామ ప్రథమ పౌరుడికి గొప్ప స్థానం వస్తుందని తెలియజేశారు. గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్ లకు శాలువా, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. అనంతరం భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ లు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
