Mallanna Swamy |జాతరకు తరలి వెళ్తున్న భక్తులు
Mallanna Swamy |జాతరకు తరలి వెళ్తున్న భక్తులు
Mallanna Swamy |కుంటాల, ఆంధ్రప్రభ : మండలంలోని నిర్మల్ మండలం ముజిగి గ్రామంలో గత శనివారం నుండి అత్యంత వైభవంగా మల్లన్న స్వామి వారి జాతర జరుగుతుంది. అయితే ఉత్సాహాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి సైతం పెద్ద సంఖ్యలో వస్తారు అయితే ఆదివారం మండల కేంద్రమైన కుంటాలతో పాటు అంబకంటి అంద కూర్ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.
మండల కేంద్రమైన కుంటాలకు చెందిన భక్తులు భాజాబజంత్రీలతో ముజ్జిగా మల్లన్న జాతర ఉత్సవాలు పురస్కరించుకొని స్వామివారి కల్యాణాన్ని పురోహితులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే ఆదివారం రాత్రి సల్ల కుండలతోపాటు సోమవారం రథోత్సవం, మంగళవారం నాగవల్లి, చివరి రోజు జరిగే అగ్నిగుండంతో పాటు జాతర ముగుస్తుంది. సల్ల కుండలతో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు తరలి వెళ్లారు. మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలకు చెందిన భక్తులు సైతం పెద్ద సంఖ్యలో గ్రామానికి జాతరకు రెండు రోజుల ముందుగానే తరలి వెళ్తారు.
