Wanaparthy | ఒక్క అవకాశం ఇవ్వండి

Wanaparthy | ఒక్క అవకాశం ఇవ్వండి
Wanaparthy | వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఈ రోజు 33 వ వార్డు వల్లబ్ నగర్ బీజేపీ అభ్యర్థి బచ్చు సౌజన్య రామ్ వార్డులో పర్యటన చేసి ప్రజలను బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తే మీ ఇంటికి వచ్చి పని చేస్తాడు కాంగ్రెస్ కళ్లిబోల్లి మాటలు విని వారి మాటలకు ఓటు వేస్తే వారి ఇంటికి వెళ్లి కాంగ్రెస్కు పని చేయాలిగతంలో కూడా ఒకసారి అనుభవం అయింది. వారు కాంగ్రెస్ వారు గేటు దగ్గర కూడా రానివ్వరు ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని వారికి అండగా ఉంటానని ఈ దేశంలో నరేంద్ర మోడీ చేసిన పథకాలను, భారత దేశ అభివృద్ధిని తెలియపరచుకుంటూ ఇంటి ఇంటికి ప్రతి ఇంటికి గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది.
దేశం బాగుండాలంటే బిజెపికి ఓటు వేసి గెలిపించాలని రాబోయే కాలం భారతదేశం మొత్తం బీజేపీ కమలం విశ్వసిస్తుందని కాంగ్రెస్ చేసిన మోసపూరిత కుట్రలను తిప్పి కొట్టాలని డబ్బు బలంతో ముందలికొస్తున్న అధికార దహనంతోనా ఆరు గారెంటీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు వేసుకోవడానికి వస్తుంది కాబట్టి ప్రజలకు తెలియజేసి వారికి నమ్మొద్దని వారి మాటలు నమ్మొద్దని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఒక్కమాట ఒక్కటి కూడా నిజం లేదన్నారు. కాబట్టి వారికి అవకాశం ఇవ్వకండి బీజేపీ బలపరిచిన అభ్యర్థులను కమల పువ్వుకు ఓటేసిగెలిపించండి అని కోరడం జరుగుతుంది ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఆదరణతో బీజేపీకి తప్పకుండా ఓటు వేస్తామని మాట ఇవ్వడం జరుగుతుంది. బీజేపీకి ఓటు వేస్తే ప్రశాంతంగా ఉంటామని ప్రజలే తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వార్డులోని యువత, మాజీ కౌన్సిలర్ సుమిత్రమ్మ, గట్టు, మెడికల్ సత్తి, అర్జున్, సన్నీ, చరణ్, చంటి, అనిల్ గౌడ్, శివ, తరుణ్ పాల్గొనడం జరిగింది.
