AP | వేడెక్కిన రాజకీయం..

AP | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి ప్రయత్నించారన్న ఆరోపణలతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

తిరుమల దేవస్థానం లడ్డూ అంశంపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన పాప ప్రక్షాళన పూజల కార్యక్రమంలో పాల్గొనేందుకు అంబటి రాంబాబు గోరంట్లకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు ఆయన వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించారు. పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు సహనం కోల్పోయారు. దుర్భాషలాడుతూ.. సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరగడంతో ఆయన అనుచరులు గుంటూరులోని నివాసం వద్దకు భారీగా చేరుకుంటున్నారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Leave a Reply