Fire Accident | లారీ దగ్ధం.. ఒకరు సజీవదహనం

Fire Accident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అగ్నిప్ర‌మాదంలో లారీ ద‌గ్ధ‌మై ఒక‌రు స‌జీవ‌ద‌హ‌న‌మైన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి సమీపంలోని తోటలో కొబ్బరికాయలు కోతకు 18మంది కూలీలు వెళ్లారు.

కాయలు కోస్తుండగా విద్యుత్‌ తీగలు లారీపై పడడంతో మంటలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో లారీపై కూర్చున్న పి. మల్లికార్జున అనే వ్యక్తికి మంటలు అంటుకుని సజీవదహనమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply