School | భాగ‌స్వాములం అవుతాం….

School | భాగ‌స్వాములం అవుతాం….

School | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని స్థానిక ద్రోణ పాఠశాలలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో ఈ రోజు స్వదేశీ కొరకు పరుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ ప్రతిజ్ఞ చేశారు. స్వదేశీ వస్తువులనే వాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధికి మేము కూడా భాగస్వాములం అవుతామని, అమెరికా, చైనా, టర్కీ దేశాల వస్తువులని బహిష్కరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ సురేష్ రెడ్డి , ప్రిన్సిపాల్ గంగాధర్, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ ముత్యం, అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, స్వదేశీ జాగరణ మంచ్ నిర్మల్ జిల్లా సహా సంయోజక్ శివ పాల్గొన్నారు.

Leave a Reply