VISIT | జంపన్న వాగులో భక్తుల పుణ్య స్నానాలు

VISIT | జంపన్న వాగులో భక్తుల పుణ్య స్నానాలు
VISIT | మేడారం (వాజేడు ఆంధ్రప్రభ) : మేడారం మహా జాతరకు హాజరైన భక్తులు ముందుగా జంపన్న వాగు చేరుకొని కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో కలిసి పుణ్యస్నానాలు చేస్తున్నారు. దీంతో జంపన్న వాగు జనసంద్రంగా మారింది. రాష్ట్ర నలుమూలల నుండే కాక పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు అత్యధికంగా తరలిరావడంతో వనమంతా జనసంద్రంగా మారింది.

తలనీలాలు తీసుకొని భక్తిశ్రద్ధలతో వనదేవతలైన సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి భక్తులు గద్దెల వద్దకు తరలివెళ్తున్నారు. సారలమ్మ కన్నెపల్లి నుండి ఈరోజు గద్దెలకు చేరుకుంటున్న తరుణంలో భక్తులు అత్యధికంగా మొక్కులు చెల్లిస్తున్నారు. తల్లులను వేడుకుంటున్నారు. భక్తులతో గద్దెల ప్రాంగణం రద్దీగా మారింది. గద్దెల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
