Jana Nayagan | జన నాయగన్ రిలీజ్ డేట్ ఫిక్స్..?

Jana Nayagan | జన నాయగన్ రిలీజ్ డేట్ ఫిక్స్..?

Jana Nayagan | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన ఆఖరి చిత్రం జన నాయగన్. ఈ మూవీని హెచ్ వినోద్ తెరకెక్కించారు. విజయ్ (Vijay) లాస్ట్ మూవీ కావడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. సంక్రాంతికి థియేటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమా సెన్సార్ కష్టాల వలన వాయిదాపడడం తెలిసిందే. ఇప్పుడు ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అంటూ వార్తలు రావడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. జన నాయగన్ వచ్చేది ఎప్పుడు..?

Jana Nayagan

Jana Nayagan | ఇంతకీ ఎప్పుడంటే..

జన నాయగన్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కోర్టులో అయినా తీర్పు అనుకూలంగా వస్తుందని.. సెన్సార్ అడ్డంకులు దాటుకుని థియేటర్స్ లోకి జన నాయగన్ తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నించారు కానీ.. ప్లాన్ ఫలించలేదు. నేడు ఈ సినిమాకి సంబంధించి కోర్టు (Court) నుంచి తీర్పు రానుంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు కొత్త డేట్ లాక్ అయినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఎప్పుడంటే.. ఫిబ్రవరి 6న జన నాయగన్ మూవీని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్.

Jana Nayagan

Jana Nayagan | ఈ సినిమా కథ విషయానికి వస్తే..

బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా రీమేక్ అంటూ ప్రచారం జరిగింది. దీని గురించి మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. జన నాయగన్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత క్లారిటీ వచ్చింది. భగవంత్ కేసరి కథ ఆధారంగా కొన్ని మార్పులు చేర్పులుతో ఈ సినిమా తెరకెక్కించారట. కాకపోతే.. విజయ్ పొలిటికల్ కెరీర్ కు ఉపయోగపడేలా.. కథను మార్చారని తెలిసింది. ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా నటించగా.. మమితా బైజు విజయ్ కి కూతురు పాత్రలో నటించింది. అలాగే బాబీ డియోల్ విలన్ గా నటించారు. సంగీత సంచలనం అనిరుధ్ సంగీతం అందించారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. మరి.. లేట్ గా వస్తున్న జన నాయగన్ ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

Jana Nayagan

CLICK HERE TO READ మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు

CLICK HERE TO READ MORE

Leave a Reply