India’s star shuttler | సింధూ.. సూప‌ర్

India’s star shuttler | సింధూ.. సూప‌ర్

  • ఇండోనేషియా మాస్టర్స్​లో క్వార్టర్స్ ఫైనల్స్​కు చేరిన భారత స్టార్ షట్లర్

India’s star shuttler | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఇండోనేషియా మాస్టర్స్‌లో తాజాగా జరిగిన ప్రీ క్వార్టర్స్​లో లైన్‌ హోజ్‌మార్క్‌ను ఎదుర్కొన్న భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు 21-19, 21-18 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. దీంతో ఆమె క్వార్టర్ ఫైనల్స్​కు దూసుకెళ్లింది. దీంతో ఆమె అరుదైన రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 500 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్‌ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో ఇప్పటి వరకు ఈ రికార్డును ఐదుగురు మాత్రమే అందుకున్నారు. ఇప్పుడు ఆరో ప్లేయర్‌గా సింధు నిలిచింది. భారత్‌ తరఫున ఈ ఘనత నెలకొల్పింది సింధునే.

Leave a Reply