CM Revanth | మహిళలకు 4 వందల కోట్ల ప్రమాద భీమా

CM Revanth | మహిళలకు 4 వందల కోట్ల ప్రమాద భీమా

  • మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ అండగా నిలుస్తుంది : మంత్రి సీతక్క,
  • మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి,

CM Revanth | భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల్లో ఉండి ప్రమాదవ శాత్తు మరణించిన 4 వందల మంది సభ్యులకు రూ 10 లక్షల చొప్పున రూ. 40 కోట్లు అందజేసినట్టు నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి ద‌న‌స‌రి అనసూయ (సీతక్క) తెలిపారు. బుధవారం మండలం మెండోరా గ్రామ బైపాస్ నుండి కమ్మర్ పల్లి మండలం నర్సాపూర్ వరకు రూ కోటి.85 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం(road construction) కొరకు భూమి పూజ చేశారు.

ఈ సందర్బంగా గ్రామంలో మంత్రి దాసరి అనసూయ సీతక్క బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ తో కలిసి ప్రసంగించారు. మహిళా సంఘాల్లో సభ్యులగా చేరాలని సూచించారు. సంఘాల్లో ఋణం తీసుకుని మరణించిన వారికి సైతం రూ 2 లక్షలు మాఫీ అవుతుందన్నారు. మహిళలు అభివృద్ధి చెందితే కుటుంబం బాగుపడుతుందని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సైతం మహిళల పేరిట ఇవ్వడం జరుగుతుందన్నారు.

CM Revanth |

అందుకు నిదర్శనం ఇందిరమ్మ ఇండ్లు మహిళా సభ్యుల పేరిట ఇవ్వడం అన్నారు.ఐకేపీ ద్వారా కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిదర్శనం అన్నారు. ఇందిరా మహిళా శక్తి(Women power) పథకం ద్వారా సంఘాల్లో ఉన్నా లేకున్నా అందరు మహిళలకు చీరలు అందజేయడం జరుగుతుందన్నారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం కాకుండా మండలానికి ఒక్క బస్సు మహిళా సంఘాల కు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

CM Revanth |

తన కు సమ్మక్క సారక్క(Sammakka Sarakka) జాతర బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ కోరిక మేరకు రావడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే గా ఓటమి చెందినప్పటికి గెలిచిన వ్యక్తి కంటే ఎక్కువ నియోజకవర్గం అభివృద్ధి కొరకు ముత్యాల తాపత్రయం పడుతారని అన్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్ల జీతాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.

CM Revanth |

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, తహసిల్దార్ మొహమ్మద్ షబ్బీర్, మిషన్ భగీరథ ఏఈ అమూల్య, సర్పంచ్ కుంట లక్ష్మి, ఉప సర్పంచ్ రమేష్, పల్లె శేఖర్, కోరాడి లింబాద్రి,వివిధ వార్డులకు చెందిన వార్డ్ సభ్యులు, వీడీసీ సభ్యులు, యూత్ యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

CLICK HERE TO READ MORE : YS Jagan | ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర…

CLICK HERE TO READ MORE :

Leave a Reply