Women’s groups | మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ పెద్ద పీట

Women’s groups | మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ పెద్ద పీట

Women’s groups | భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : మహిళా సంఘాల అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి సీతక్క ర్కొన్నారు. బుధవారం భీమ్‌గల్‌ మండలం మెండోరా మహిళా సంఘాల సభ్యులకు మెండోరాలో భీమ్‌గల్‌ మండలం మెండోరా గ్రామంలో బుధవారం మహిళా సంఘాలకు నాలుగు కోట్ల 10 లక్షల రూపాయల రుణాల చెక్కులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ద‌న‌స‌రి అనసూయ (సీతక్క) పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళా సంఘ సభ్యులకు ప్రమాద బీమా 10 లక్షల వరకు వర్తింపజేయడం జరుగుతుందని. లోన్ బీమా కూడా వర్తింపజేయడం జరుగుతుందని. అలాగే సంఘాలలో లేని వారిని, 60 సంవత్సరాల పైబడిన వారిని కూడా సంఘాలలో చేర్పించడం జరుగుతుందని. 18 సంవత్సరాల లోపు ఉన్న వారిని కిషోర బాలికల సంఘంలో చేర్పించడం జరుగుతుందని మహిళా సంఘాలను ఉద్దేశించి తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అంకిత, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ సునీల్ రెడ్డి, స్థానిక సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్, ఏపీఎం ప్రమీల, సీనియర్ సీసీ లు కుంట శ్రీనివాస్, పురస్తు నరేష్.జి.రఘుపతి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply