YS Jagan | ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర…

YS Jagan | ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర…

YS Jagan | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్(YS Jagan) అన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ…కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కళ తప్పాయని వైఎస్ జగన్ అన్నారు. గోరుముద్ద నాణ్యత తగ్గిందని, ఫీజు రీయింబర్స్‌మెంట్(fee reimbursement) పెండింగ్‌లో ఉందని, ఆరోగ్యశ్రీని కనుమరుగు చేశారని, 108, 104 సేవలను నిర్వీర్యం చేశారని జగన్ ఆరోపించారు. తమ ప్రభుత్వం ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించిందని, ప్రస్తుత ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తోందని ఆయన విమర్శించారు.

Leave a Reply