Narcotic | అంతంపల్లి శివారులో దారుణం…..

Narcotic | అంతంపల్లి శివారులో దారుణం…..
- కోతులకు మత్తు పదార్థాలు ఇస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు…..
- అంతంపల్లి శివారులో గమనించిన గ్రామస్తులు….
- ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు….
- తమకు సంబంధం లేదంటున్న అధికారులు…..
Narcotic | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : బిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామ శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు కోతులకు మత్తుమందు ఇస్తూ చంపేస్తున్నారు. అట్టి కోతులను అంతంపల్లి గ్రామ శివారులో పడేశారు. దానిని గ్రామ సర్పంచ్ మంజుల సంజీవరెడ్డి తో పాటు గ్రామస్తులు గమనించారు.
ఇట్టి విషయాన్ని గ్రామ సర్పంచి మంజుల సంజీవరెడ్డి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా తమకేమి సంబంధం లేదని సమాధానమిచ్చినట్లు ఆమె తెలిపారు. సుమారు 50 కోట్లకు మత్తు పదార్థాలు ఇచ్చి గ్రామ శివారులోని దాబా హోటల్స్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కోతులను వదిలిపెట్టారు. అందులో కొన్ని కోతులు చనిపోగా మరికొన్ని కోతులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని గ్రామస్తులు పసిగట్టారు. మరికొన్ని కోతులు అక్కడి నుండి పరారయ్యాయి.

తమ గ్రామ శివారులో కోతులను వదిలిపెట్టడం ఎంతవరకు సమంజసమని గ్రామ సర్పంచి మంజుల సంజీవరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోతులకు మత్తు పదార్థాలు ఇచ్చి చంపేసిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రతి విషయాన్ని స్థానిక పోలీసులకు సైతం ఆమె సమాచారం అందించారు.
