MLA | పట్టణ సమస్యలపై నిరసన

MLA | పట్టణ సమస్యలపై నిరసన
MLA | పరకాల, ఆంధ్రప్రభ : పట్టణ సమస్యలపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీ ప్రసాద్ రావు(Dr. Kali Prasad Rao) హాజరై మాట్లాడుతూ… పరకాల పట్టణంలోని 22 వార్డులలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, పట్టణంలోని సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు. పరకాల అభివృద్ధి మార్పు చూపిస్తా అని చెప్పినా ఎమ్మెల్యే(MLA) ఇప్పటివరకు ఎలాంటి మార్పు చూపించలేకపోతున్నారని అన్నారు.
పట్టణ సమస్యలపై బీజేపీ నిరంతర పోరాటం చేస్తుందని, బీజేపీ పార్టీతోనే పరకాల పట్టణ సమస్యల పరిష్కారం, అభివృద్ధి జరుగుతుందని డాక్టర్ కాళీ ప్రసాద్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గురు ప్రసాద్, జిల్లా కోశాధికారి ఎర్ర రామన్న, మాజీ కౌన్సిలర్లు బెజ్జంకి పూర్ణ చారి, కోలనుపాకు భద్రయ్య, నాయకులు బాసాని సోమరాజు, దంచనాల సత్యం, సంఘ పురుషోత్తం, దుబాసి కృష్ణ, పాలకుర్తి తిరుపతి, ఆకుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
