Police | నమ్మకం, గౌరవం పెరిగేలా పని చేయాలి

Police | నమ్మకం, గౌరవం పెరిగేలా పని చేయాలి

  • బాధితులకు న్యాయం చేకూర్చండి
  • పోలీసులు ప్రజా సేవకులే
  • వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్

Police | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం, విశ్వాసం, గౌరవం పెరిగేలా విధులు నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులకు తగిన న్యాయం జరుగుతుందని నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలన్నారు. పోలీసులు ప్రజాసేవకులేనని నిరూపించుకొనే రీతిలో పోలీసుల పనితీరు ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.

నర్సంపేట పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్ స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ముష్కే శ్రీనివాస్ ఈ రోజు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కొత్వాల్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ విధి నిర్వహణను నీతి, నిజాయితీతో పాటు నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా బాధితులకు తగిన న్యాయం చేకూర్చి పోలీసుల ప్రతిష్టను పెంచాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.

Leave a Reply