Complaint | సీఎంపై ఎమ్మెల్సీ ఫిర్యాదు

Complaint | అంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని.. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు పార్టీల మధ్య గొడవలు జరిగితే దానికి కారణం రేవంత్ రెడ్డే అన్నారు.

నిన్న ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలని దివంగత ఎన్టీఆర్ ఫ్యాన్స్, చంద్రబాబు అభిమానులకు పిలుపునిచ్చారు. ఖమ్మంలో ఎన్టీఆర్‌కు అశేషమైన అభిమాన గణం ఉందని, అలాగే చంద్రబాబు నాయుడుకి అనేక మంది సహచరులు, అనుచరులు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చేయాలని గతంలో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నించిందని.. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని గొయ్యి తీసి పాతిపెట్టినప్పుడే దివంగత ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించినట్లు అన్నారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చేయాలని మాట్లాడారు.

Leave a Reply