public voice | ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి..

public voice | ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి..

  • తాసిల్దార్ సునీత

public voice | బిక్కనూర్‌, ఆంధ్రప్రభ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని తాసిల్దార్ సునీత చెప్పారు. ఈ రోజు తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.

అందులో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు. వాటిని పరిశీలించి ఫిర్యాదుదారులకు తగిన న్యాయం చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు ప్రజావాణిలో పాల్గొనాలని సూచించారు. లేని పక్షంలో మేము జారీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రాజ్ కిరణ్ రెడ్డి, పశు వైద్యాధికారి దేవేందర్, నీటిపారుదల శాఖ ఏఈ ఆనందం, మిషన్ భగీరథ ఏఈ శ్రీనివాస్, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave a Reply