MLA | వన దేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్ఆర్
MLA | ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతల జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహా జాతరగా, దక్షిణాది కుంభమేళాగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణలోని ములుగు జిల్లాలోని మేడారం అటవీ ప్రాంతంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరలో కోట్లాది మంది గిరిజనులు, ఆదివాసులు, భక్తులు తరలివచ్చి సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంటారు.
దక్షిణాది కుంభమేళాగా పేరుగాంచిన మేడారం శ్రీ సమ్మక్క – సారలమ్మ వన దేవతలను ఇవాళ భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.
