Arrive Alive | వేగం,మద్యం మత్తు కంటే ప్రాణాలే ముఖ్యం

Arrive Alive | వేగం,మద్యం మత్తు కంటే ప్రాణాలే ముఖ్యం

  • జీవితం చాలా విలువైనది
  • రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలి
  • రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకే ట్రాఫిక్ రూల్స్
  • కుటుంబాల కోసమైనా క్షేమంగా డ్రైవ్ చేయాలి
  • సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత

Arrive Alive | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : వాహనాలు నడపడం కంటే జీవితం చాలా విలువైనదని గుర్తించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత పిలుపునిచ్చారు. వేగం,మత్తు, కిక్, థ్రిల్ కంటే ప్రాణాలు అత్యంత ముఖ్యమని గుర్తు చేశారు.ట్రాఫిక్ రూల్స్ పాటించడమంటే భద్రత ప్రమాణాలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవడమేనని పేర్కొన్నారు.


రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన అరైవ్ అలివెన్స్ కార్యక్రమంను కాజీపేట పోలీసుల ఆధ్వర్యంలో కాజీపేటలో గల నర్సింగ్ కళాశాల లో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనా కల్పించే విధంగా విద్యార్థులకు వ్యాస రచన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల కారణంగా పెద్ద సంఖ్యలో వయస్సులో ఉన్న యువతను కోల్పోతున్నామన్నారు.

Arrive Alive

ఇందుకు కారణం యువత నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం కారణమని ఎత్తి చూపారు. రహదారి భద్రత విషయంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని అప్పుడే ప్రమాదాలు తగ్గుతాయన్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని ఎత్తి చూపారు.ట్రాఫిక్ నియమాలను గౌరవించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చనని గుర్తు చేశారు.

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన,గాయపడ్డ కుటుంబాల స్థితిగతులను గుర్తించైనా వాహనాలను జాగ్రత్రగా నడపాలని సెంట్రల్ జోన్ డిసిపి ధార కవిత సూచించారు.అర్ధరాత్రి తర్వాత,తెల్లవారు జామున,
ఉదయం వేళల్లోనే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు.అదీగాక మద్యం మత్తు,అతి వేగంగా వెహికిల్స్ డ్రైవ్ చేయడం వల్లే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని ఎత్తి చూపారు.

Arrive Alive

వాహనాలు నడిపే సమయంలో ఏకాగ్రత,వేగాన్ని నియంత్రించే పరిమితిలోనే వాహనాలు నడపడం ఉత్తమమని సెంట్రల్ జోన్ డిసిపి ధార కవిత సూచించారు. అనంతరం ఉత్తమమైన వ్యాసం వ్రాసిన విద్యార్థులకు డీసీపీ ధార కవిత బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు,వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, కాజీపేట ఇన్స్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి,కాజీపేట ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ పిట్టల వెంకన్నతో పాటు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.