Minister Lokesh | సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం…

Minister Lokesh | సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం…

  • నారావారిపల్లె  ప్రజాదర్బార్‌లో మంత్రి లోకేష్ 

Minister Lokesh | తిరుపతి  (రాయలసీమ), ఆంధ్రప్రభబ్యూరో : తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించడానికి కృషి చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి(Minister Lokesh) నారా లోకేష్ ప్రజలకు హామీ ఇచ్చారు. స్వగ్రామంలో సంక్రాంతి పండుగ జరుపుకోడానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో ఈ రోజు భోగి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.

అందరూ తమ ఇళ్లవద్దే పండుగ జరుపుకోవాలని సూచిస్తూ ఈ రోజు ఎవరూ తనను కలవడానికి ముందురోజే రావొద్దని పార్టీ నాయకులకు, శ్రేణులకు, అధికారులకు చంద్రబాబు సూచించారు. ఫలితంగా చంద్రబాబు కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే వేడుకలలో పాల్గొన్నారు . అయితే ఈ విషయం తెలియని వివిధ ప్రాంతాల ప్రజలుపెద్దఎత్తున తరలివచ్చారు.

Minister Lokesh |
Minister Lokesh |

తమ సమస్యల(problems) గురించి చెప్పుకోడానికి వచ్చిన పర్చడం సముచితం కాదని మంత్రి లోకేష్ తమ ఇంటి వద్దే ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేష్.. వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు.

Minister Lokesh |

వారసత్వంగా తమకు సంక్రమించిన 1.83 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన పత్తి శివకుమార్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తిరుమలలో అంగప్రదక్షణ భక్తులకు ఆఫ్ లైన్(offline) ద్వారా టోకెన్స్ జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ విధానాన్ని రద్దు చేయాలని ‘తిరుమలలో అంగప్రదక్షణ భక్తబృందం’ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు.

Minister Lokesh |

చిత్తూరు జిల్లా నిండ్రమండలం, కచ్చరావేడు గ్రామంలో దళితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని బి.శ్రీనివాసులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు. తిరుపతి, పరిసర ప్రాంతాల్లో 150 ఎస్టీ(150 ST) ఎరుకుల కుటుంబాలు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని, ఆయా కుటుంబాలకు ఒకే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని శ్రీ వేంకటేశ్వర ఎస్టీ ఎరుకల సంఘం ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

Minister Lokesh |

తిరుమల తిరుపతి దేవస్థానంలో సొసైటీ విధానంలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ(data entry) ఆపరేటర్లు, డేటా ఎంట్రీ ఆఫీసర్లకు ఇతర ఉద్యోగుల మాదిరిగానే వైద్య సదుపాయంతో పాటు శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలో తొలగించిన 160 మంది కాంట్రాక్ట్ సూపర్ వైజర్లు, పార్ట్ టైం సూపర్ వైజర్లకు డీఈఎస్ విభాగంలో తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కాంట్రాక్ట్ సూపర్ వైజర్స్ అసోసియేషన్(ఏపీఈఎస్ సీఎస్ఏ) ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు.

Minister Lokesh |

వారసత్వంగా సంక్రమించిన తమ రెండెకరాల భూమిని ఆన్ లైన్ లో నమోదు చేసి హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బలిజపల్లికి చెందిన కె.పార్వతి విజ్ఞప్తి చేశారు. ఆయా వినతులను పరిశీలించి వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి లోకేష్ హామీలిచ్చారు. పలువురి మేరకు లోకేష్ వారితో ఫోటోలు దిగారు.

CLICK HERE TO READ MORE : Temple | శ్రీకోదండ రామాలయం, పంచవటి కాలనీ, మణికొండ

CLICK HERE TO READ MORE :

Leave a Reply