SI | హెల్మెట్ తప్పనిసరి..

SI | హెల్మెట్ తప్పనిసరి..
- అరైవ్, అలైవ్ కార్యక్రమంలో ఎస్‌ఐ ఉదయ్ కుమార్
SI | వెల్గటూర్, ఆంధ్రప్రభ : ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, అలాగే కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పక ధరించాలని “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ పి.ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు వారసంతలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ… ప్రతి వాహనదారుడు హెల్మెట్ తోపాటు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అధిక వేగం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగం చేయకూడదని వివరించారు. రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించడంతో పాటు తమ కుటుంబ సభ్యుల తోపాటు ఇతర రోడ్డు వినియోగదారుల ప్రాణాలను కాపాడుకోవచ్చని, ప్రమాదాల నివారణ, అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
అందరూ విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ, రోడ్డు భద్రతను సామూహిక బాధ్యతగా తీసుకుని “అరైవ్ అలైవ్” లక్ష్యాన్ని సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ల ఫోరమ్ మండల అధ్యక్షుడు గండ్ర ప్రతాప్ రావు, మాజీ సర్పంచ్ మెరుగు మురళీ గౌడ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు బందెల ఉదయ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ గండ్ర శ్రీకాంత్ రావు, మాజీ ఉప సర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జూపాక ప్రవీణ్, కస్తూరి మల్లేష్, కస్తూరి తిరుమల్లేష్, ఎనగందుల నరేష్, ఎర్రోళ్ల సతీష్, ఆటో యూనియన్ సభ్యులు, వ్యాపారులు, కొనుగోలుదారులు, వాహనదారులు, గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
