MLA Ramu | ఆ.. పనుల్లో విజయం సాధించాలి..
MLA Ramu | ఆ.. పనుల్లో విజయం సాధించాలి..
MLA Ramu, గుడివాడ, ఆంధ్రప్రభ : ప్రజలందరికీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే వేడుక భోగి అన్నారు. ఈ భోగి భోగభాగ్యాలతో పాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని చెప్పారు. శీతాకాలపు చల్లటి గాలులను చీల్చుతూ వెలిగించే భోగి మంటలు ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త కాంతులు తీసుకురావాలని అన్నారు. భోగి వేళ ఆటంకాలన్నీ తొలగిపోయి అందరికీ సకల శుభాలు జరగాలని తెలిపారు. గుడివాడ అభివృద్ధి కోసం, మంచి మనస్సుతో తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు.
