Mutharam | సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా బాపు

Mutharam | సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా బాపు
Mutharam | మహాముత్తారం, ఆంధ్రప్రభ : మహా ముత్తారం మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ కొండగొర్ల బాపు ఇటీవల జరిగిన సాధారణ పంచాయతీ ఎన్నికల్లో మహాముత్తారం సర్పంచ్ గా ఎన్నికయ్యారు. మండల కేంద్రం కావడంతో ఐటీ పరిశ్రమలు అండ్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు బాపును కాంగ్రెస్ పార్టీ మహాముత్తారం మండల సర్పంచుల సంఘం అధ్యక్షునిగా ఇవాళ నియమించారు. ఈ నియామకానికి సహకరించిన పీసీసీ జనరల్ సెక్రెటరీ దుద్దిళ్ల శ్రీనుబాబుతో పాటు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాపు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
