జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించిన కేజీబీవీ విద్యార్థినికి అవార్డు..

జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించిన కేజీబీవీ విద్యార్థినికి అవార్డు..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని కేజీబీవీ గురుకుల విద్యాలయం విద్యార్థిని ఎం, సాత్విక, ఎంపీహెచ్ డబ్ల్యూ సెకండియర్ లో జిల్లా టాపర్ గా నిలిచింది, ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక ,99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రత్యేక విద్యా వారోత్సవాల లో ఆదివారం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. సాత్విక విద్యా వార్షికోత్సల అవార్డుకు ఎంపికైంది.

దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం, రూ 10 వేల చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి సుమలత , విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. దీంతో సాత్వికను ప్రత్యేక అధికారి సుమలత, ఉపాధ్యాయ బృందం, అభినందించారు.

Leave a Reply