90percent | బీసీల రిజర్వేషన్లపై పలు డిమాండ్లు…

90percent | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నేడు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలంటూ కవిత బహిరంగ లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, ప్రాజెక్టుకు 90 శాతం కేంద్ర నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే 2027 జనగణనలో ప్రత్యేక ఓబీసీ కాలమ్ చేర్చాలని, మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ బీసీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం త్వరగా ఇవ్వాలని, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, తెలంగాణలో 52% బీసీ జనాభా ఆకాంక్షలను గౌరవిస్తూ సామాజిక న్యాయం కోసం కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.