T20 World Cup | స్పిన్నర్లకు పెద్దపీట

T20 World Cup | స్పిన్నర్లకు పెద్దపీట

  • టీ20 వరల్డ్ కప్ కోసం ఆసీస్ జట్టు ప్రకటన

T20 World Cup | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : శ్రీలంక వేదికగా జరగనున్న టీ 20 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఉపఖండ పరిస్థితులకు తగ్గట్టుగా స్పిన్‌కు ప్రాధాన్యమిచ్చింది. ఈ జట్టులో స్పిన్నర్లకు పెద్దపీట వేశారు. భారత్, శ్రీలంక పిచ్‌లను దృష్టిలో ఉంచుకుని నలుగురు స్పెషలిస్ట్ స్పిన్నర్ల(Specialist spinners)ను ఎంపిక చేయడం విశేషం. గాయాల నుంచి కోలుకున్న కమిన్స్, హేజిల్‌వుడ్, టిమ్ డేవిడ్‌లకు చోటు దక్కింది. కూపర్ కానొలీ ఎంపిక ఆసక్తికరంగా మారింది. వరల్డ్ కప్‌కు ముందు పాకిస్తాన్‌తో సిరీస్ ఆడనుంది. మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో టీ 20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా ఫిబ్రవరి 11న తన తొలి మ్యాచ్ ఆడనుంది.

ఈ జట్టు ఎంపికలో కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. గత 12 టీ20 మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా ఆడని యువ ప్లేయర్ కూపర్ కొన్నోలీ(Young player Cooper Connolly)కి సెలెక్టర్లు అవకాశం కల్పించారు. అలాగే జేవియర్ బార్ట్‌లెట్, మాథ్యూ షార్ట్, మాథ్యూ కుహ్నెమాన్ తొలిసారిగా వరల్డ్ కప్ ఆడేందుకు సిద్ధమయ్యారు. అయితే, మిచెల్ ఓవెన్‌కు జట్టులో చోటు దక్కలేదు. మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్, పేసర్ స్పెన్సర్ జాన్సన్ వెన్ను గాయం కారణంగా ఈసారి ఆసీస్ జట్టులో ఒక్క లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా లేకపోవడం గమనార్హం. జట్టులో ఏకైక వికెట్ కీపర్‌గా జోష్ ఇంగ్లిస్ ఎంపికయ్యాడు.

మరోవైపు సీనియర్ బౌలర్లు ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, టిమ్ డేవిడ్ గాయాల నుంచి కోలుకుంటున్నారు. వీరి ఫిట్‌నెస్ గురించి ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ(Australia chief selector George Bailey) మాట్లాడుతూ.. “కమిన్స్, హేజిల్‌వుడ్, డేవిడ్ కోలుకుంటున్నారు. వరల్డ్ కప్ సమయానికి వారు అందుబాటులో ఉంటారనే నమ్మకం ఉంది” అని తెలిపారు. ఐసీసీ నిబంధనల ప్రకారం జనవరి 31 వరకు జట్లలో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా గ్రూప్-బీలో ఉంది. ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 11న కొలంబో వేదికగా ఐర్లాండ్‌తో ఆడనుంది. ఈ గ్రూప్‌లో శ్రీలంక, ఒమన్, జింబాబ్వే జట్లు కూడా ఉన్నాయి.

ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్ వెల్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, మాథ్యూ కుహ్నెమాన్, మాథ్యూ షార్ట్.

CLICK HERE TO READ స్ట్రాంగ్ టీం రెడీ..

CLICK HERE TO READ MORE

Leave a Reply