కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరశీలన….

మక్తల్ , ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పరిశీలించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని కాట్రెవుపల్లి గ్రామం వద్ద ఫేస్ వన్ లో భాగంగా నిర్మిస్తున్న కొడంగల్ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ పనులను అదేవిధంగా కెనాల్ పనులను మంత్రి పరిశీలించారు .ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనుల వివరాలను తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు

. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. కొడంగల్ భూములకు కృష్ణాజిల్లాలో అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను వేగవంతంగా చేపట్టాలని సూచించారు. పనుల్లో జరుగుతున్న తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూనే పనుల్లో మరింత వేగం పెంచాలని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన రైతులతో మంత్రి కాసేపు మాట్లాడారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా రూ. 4750 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ఎత్తిపోతల పూర్తయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందనుందని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఏడాదిలోగా పొలాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.మంత్రి వెంబడి కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్ కుమార్ గుప్తా, బి. గణేష్ కుమార్,మంథన్ గోడ్ సర్పంచ్ కె.రాజేందర్ గౌడ్, నాయకులు వాకిటి హన్మంతు ,కృష్ణయ్య గౌడ్ , చెన్నయ్య గౌడ్,ఇరిగేషన్ ఏఈ నాగశివ ,సిఐ రామ్ లాల్ తదితరులు ఉన్నారు.

Leave a Reply